Cancel Preloader

వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు…

 వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు…

Ap Local Tv; వంద రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్.

ఈ రోజు రాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు.

97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత,భర్త శంకర్ రావు బాగోతం ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకొచ్చారు.

భూకబ్జాలకు పాల్పడుతు, ప్రభుత్వ భూములను మాయం చేసే దిశగా శంకర్ రావు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అదీప్ రాజ్ అధికారులను కోరారు. సర్వే నెంబర్ 113లో జరుగుతున్న అన్యాక్రాంతాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే బక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు విలువచేసే భూమిని మాయం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా షెడ్స్ నిర్మిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధికార దుర్వినియోగమని స్పష్టం చేశారు .

అందుకు జీవీఎంసీ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ భూములు మాయం చేస్తూ ఆక్రమణలకు గురవుతున్న స్థలాలకు ఇంటి పన్ను, కరెంట్ మీటర్ ఎలా ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు.

వందరోజుల్లోనే ఇంతటి అక్రమాలకు పాల్పడితే రానున్న 5సంవత్సరాల్లో ఎలాంటి భూదోపిడీలకు పాల్పడతారో అన్న విషయం ఉహకందటం లేదని దుయ్యపట్టారు.

సమావేశంలో 95 వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, 97 వ వార్డ్ వైసీపీ నాయకులు మింటి మహేష్ పాల్గొన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat
1
Advertise with Us
Hello
How can aplocal tv help you?